calender_icon.png 20 September, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావును పరామర్శించిన మాజీ సర్పంచ్ లు

20-09-2025 05:50:56 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు తల్లి తానిపర్తి ప్రేమలత శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందగా సుల్తానాబాద్ మండలానికి చెందిన మాజీ సర్పంచ్ లు, నాయకులు  హైదరాబాదులోని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి వారి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

సోమవారం హైదరాబాదులో ఎమ్మెల్సీ తల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ని పరామర్శించిన వారిలో మాజీ సర్పంచులు జూపల్లి రాజేశ్వరరావు, బల్మూరీ వెంకటరమణారావు, నామిని రాజిరెడ్డి, గుండ మురళి, అరుకుటి ఫకీర్ యాదవ్, బుచ్చిరెడ్డి, సుల్తానాబాద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రబెల్లి పురుషోత్తం రావు తదితరులు ఉన్నారు.