calender_icon.png 20 September, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు అవ్వండి

20-09-2025 04:41:25 PM

డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్

లక్షేట్టిపేట (విజయక్రాంతి): రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్(DCC President Kokkirala Surekha Prem Sagar) అన్నారు. శనివారం స్థానిక ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేట్, దండేపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించి రక్తదాతలకు ప్రశంసా పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డీసీసీ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ మాట్లాడుతూ... ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు. రక్తదానంతో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, ఆర్టిఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం, నలిమెల రాజు, కందుల మోహన్, చింత అశోక్, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.