calender_icon.png 20 September, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలపై అవగాహన

20-09-2025 05:47:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): బాల్య వివాహాల నుండి విముక్తులైన పిల్లలు మరియు వారి తల్లిదండ్రులకు బాల్య వివాహాల పైన అవగాహన కార్యక్రమాన్ని  శనివారం నిర్వహించారు జిల్లా బాలల సంక్షేమ సమితి, మహిళా శిశు సంక్షేమశాక విజన్ సంస్థ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. వాళ్ళ వివాహాల వలన పిల్లలకు కలిగే నష్టాలు, శారీరకంగా మానసికంగా తర్వాత ఆర్థికంగా కెరియర్ పరంగా ఏ విధంగా నష్టం జరుగుతుందో తెలపడం జరిగింది. బాల్య వివాహాల వల్ల కుటుంబ భారాన్ని పిల్లల భారాన్ని పోషణ భారాన్ని వ్యక్తిగత ఇబ్బందులను ఏ విధంగా బాలికలు ఎదుర్కొంటారు అని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు శ్రీ.సిమోన్ సుందర్ గారు, శ్రీమతి. శ్రీలత గారు, గౌరవ అతిథిగా శ్రీ.మురళి గారు బాలల రక్షణ అధికారి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విజన్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ శరత్ కుమార్ గారు, విజన్ సంస్థ ప్రాజెక్ట్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు హారిక, అనురాధ రజిత మరియు జిల్లా బాలల సంక్షేమ సమితి సిబ్బంది చైల్డ్ లైన్ సిబ్బంది ఇతరలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు పదిమంది బాల్య వివాహాల నుండి విముక్తి అయిన బాలీకలు వారి తల్లిదండ్రులు ఇతరులు పాల్గొన్నారు.