calender_icon.png 20 September, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ గంజాయి గుట్టురట్టు..

20-09-2025 05:28:52 PM

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్పోర్టు(Rajiv Gandhi International Airport)లో శనివారం అధికారులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రూ.12 కోట్ల విలువ చేసే 12 కిలోల విదేశీ గంజాయిని బ్యాగ్ లో తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఈ గంజాయిని పట్టుకున్నారు. ఈ మేరకు అధికారులు నిందితునిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.