calender_icon.png 20 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

20-09-2025 05:35:33 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ చారిత్రక వేయి స్తంభాల ఆలయం వద్ద రాష్ట్రస్థాయి బతుకమ్మ వేడుకల ప్రారంభోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను మున్సిపల్, పోలీస్, విద్యుత్, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డిసిపి షేక్ సలీమా, ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుద్దీపాలను అమర్చాలని, తాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారు కాబట్టి మహిళా పోలీసులు ఎక్కువ సంఖ్యలో బందోబస్తులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ఏసీపీ నరసింహారావు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.