calender_icon.png 11 September, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్ లో చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభించిన ప్రత్యేక అధికారి ఎస్ పంకజ

10-09-2025 10:50:00 PM

మేడిపల్లి (విజయక్రాంతి): 100 రోజుల ప్రణాళిక అమలులో భాగముగా బోడుప్పల్ నగర పాలక సంస్థలో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి పలు పార్క్ లను చిల్డ్రన్స్ పార్కులుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇట్టి అభివృద్ధి చేసిన పార్కులను నేడు ప్రత్యేక అధికారి ఎస్. పంకజ(Special Officer Pankaja), కమీషనర్ ఎ. శైలజాతో కలసి హేమ నగర్, రాజశేఖర్ కాలనీ, మణికంఠ కాలనీలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమములో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.