10-09-2025 10:56:33 PM
మణుగూరు (విజయక్రాంతి): మండల పరిధిలోని ఆదివాసీ గ్రామం పెద్దిపల్లిలో బుధవారం ఏరియా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 54 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా పరిసర ప్రాంతాల గ్రామలకు సంస్థ ఉచిత వైద్య శిబిరాలను మరింతగా విస్తృత పరుస్తుందని డీజీఎం(పర్సనల్) ఎస్. రమేష్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు డాక్టర్లు అవగాహన కలిపించారన్నారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శ్రీమతి అనంతలక్ష్మి, సేవ కో ఆర్డినేటర్ రామేశ్వర రావు, ఏరియా హాస్పిటల్ సిబ్బంది రవి, రామ, శ్రవణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.