10-09-2025 11:11:09 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో వృద్ధుల, వితంతుల, ఆసరా, పెన్షన్ పెంపుకై జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి సైదులు మాదిగ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన వికలాంగుల మహా గర్జన సభ జిల్లాల్లో ఉన్న ప్రతి తాసిల్దార్ కార్యాలయం ముందు పెన్షన్ పెంపుకై ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఒకరిని ఇంచార్జిగా నియమించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షుడు రామస్వామి మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు హుస్సేన్ గళ్ళ మురళి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చర్లపల్లి యాదగిరి మాదిగ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దండోలు సామెల్ మాదిగ. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ, బక్కసాయిబాబాకొన్మండ శంకర్,గునీ శ్రీను, వికలాంగుల జిల్లా అధ్యక్షులు పాండు మాదిగ, మహిళ అధ్యక్షులు మాధవి మాదిగ, సరూప భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లేష్ మాదిగ,రాములు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.