calender_icon.png 11 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ అదాలత్ పై దృష్టి సారించాలి

10-09-2025 11:02:57 PM

మేజిస్ట్రేట్ సూరిరెడ్డి..

మణుగూరు (విజయక్రాంతి): ఈనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్‌ అదాలత్‌(Lok Adalat)పై ప్రత్యేక దృష్టి సారించాలని మణుగూరు ఫస్ట్ క్లాస్ కోర్ట్ మేజిస్టేట్ కంభపు సూరిరెడ్డి అన్నారు. స్థానిక కోర్ట్‌ హాల్‌లో బుధవారం న్యాయవాదులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి సూరిరెడ్డి మాట్లాడారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించుటలో న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్  బద్దం శ్రీనివాస్ రెడ్డి, మండల లీగల్ సర్వీస్ అడ్వకేట్ కౌన్సిలర్ సర్వేశ్వరరావు, న్యాయ వాదులు కందిమల్ల నర్సింహారావు, గురుకృష్ణ, రామ్మోహన్ రావు, చిర్ర సరస్వతి, గొడుగునూరి నాగార్జున రెడ్డి, శ్రీనివాస్రావు, అన్వేష్, ప్రభు రాజ్, రమేష్, రాము, సాంబ, వాసవి  కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.