calender_icon.png 11 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుకునే పిల్లలకు చదువు పట్ల ప్రోత్సహించాలి

10-09-2025 10:44:41 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుకునే పిల్లలకు ప్రిన్సిపాల్ లు అండగా ఉండి చదువు పట్ల ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఐ.డి. ఒ సి సమావేశ మందిరంలో జిల్లాలోని అందరూ సంక్షేమ శాఖల అధికారులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు, వసతి గృహం వార్డెన్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కే.జి.బి.వి లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే కాకుండా పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఒక విద్యార్థి కమిటి ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సంస్థలో ఒక ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని దానికి తెరిచే తాళం ప్రత్యేక అధికారి వద్ద మాత్రమే ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు సమస్యలు ఉంటే పేరు రాయకుండానే లెటర్ రాసి ఫిర్యాదు పెట్టెలో వేసే విధంగా విద్యార్థులకు సూచించాలన్నారు. 

ప్రతి విద్యాసంస్థకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ వారంలో ఒకసారి ఖచ్చితంగా తనిఖీ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. విద్యాసంస్థల్లో ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సమస్యను మాత్రం జటిలం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులతో సైతం పేరెంట్స్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి విద్యాసంస్థలో ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు క్రీడలు ఆడించి వారిని క్రీడల పట్ల ప్రోత్సహించాల్సిందిగా సూచించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిల్లా విద్యా అధికారి ఘనీ, అందరూ ఎస్.ఓ లు, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.