calender_icon.png 11 September, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిష్ణాతులైన ఉపాధ్యాయులకు సన్మానం

10-09-2025 10:41:55 PM

మణుగూరు (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఎక్స్లెంట్ హైస్కూల్ లో బుధవారం నిష్ణాతులైన, ఉపాధ్యాయులను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్(Municipal Commissioner Prasad), సామాజిక కార్యకర్త, నాయ్యవాది కర్నేరవి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కర్నె రవి మాట్లాడుతూ.. గురువు దీవెనల వల్లనే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశానికి మంచి పౌరులను అందించేది కేవలం ఉపాధ్యాయుడేనని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, నవ సమాజ రూపశిల్పులు ఉపాధ్యాయులేనన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యూసఫ్, ఖాదర్, జబ్బర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.