18 April, 2026 | 4:28 AM

మధుసూదన్ రెడ్డికి ఆత్మీయ సన్మానం

03-05-2025 01:44 AM

నల్లగొండ, మే 2 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి (ఏపీఓ) ఏదుళ్ళ మధుసూదన్ రెడ్డి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ నల్లగొండ లోని ఎమ్మెన్నార్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మధుసూదన్ రెడ్డి_ జ్యోతి దంపతులను సన్మానించారు.

తన పీఏగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఘనంగా సన్మానించారు.