13-12-2025 01:27:20 AM
శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): మాదాపూర్ చందునాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటిం చి, 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యా రు. మధ్యాహ్నం భోజనం చేసిన గంటలోపే విద్యార్థులు వరసగా కడుపునొప్పి, వాంతు లతో తరగతి గదుల్లోనే అస్వస్థతకు గురి కావడంతో ఇది గమనించిన టీచర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
అనంతరం అం బులెన్సుల్లో కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించగా అక్కడ వైద్యులు వారిని పరీక్షించి ఫు డ్ రియాక్షన్ లక్షణాలు స్పష్టంగా ఉన్నట్లు గుర్తించారు. చికిత్స పొందుతున్న వారి లో 37 మంది పిల్లలను ఏరియా హాస్పిటల్‌లోనే ఉంచగా.. పరిస్థితి విషమించిన ఆరుగురిని నానక్‌రామ్‌గూడా లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చి, ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. పిల్లల ఆరోగ్యం క్షీణించినట్టు తెలిసిన తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. పోలీసులు పాఠశాలను సందర్శించి కేసు నమోదు చేసి భోజనం తయారీ విధా నం, వాడిన పదార్థాల నాణ్యత, నిల్వ విధా నం, పరిశుభ్రత వంటి అంశాలపై దర్యాప్తును ప్రారంభించారు. పిల్లలు తిన్న భోజన నమూనాలను సీజ్ చేసి, లాబ్ పరీక్షలకు పంపారు. మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఏజెన్సీ బాధ్యతలపై కూడా విచారణ కొనసాగుతోంది.