07-07-2025 01:47:27 AM
భారతదేశ అత్యున్నత చట్టాలను మోసగించిన చరిత్ర ఆయనది
15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న. ఒక్క కార్యకర్తను సంపాదించుకోలేకపోయాడు
ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నప్పుడు పొందిన ప్రజాధనం వెంటనే రికవరీ చేయాలి
వేములవాడ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ ఫైర్
రాజన్న సిరిసిల్ల: జూలై6 (విజయక్రాంతి): వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరుడు కాదంటూ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన న్యాయపోరాటం గత కొద్ది రోజుల క్రితం ఫలించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెవెన్యూ అధికారులు రమేశ్ బాబు ఓటుహక్కును తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేయడాన్ని వేములవాడ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ స్వాగతించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప భారత స్వాతంత్ర సమరయోధుడి కుటుంబంలో జన్మించి చెన్నమనేని కుటుంబానికి ఒక మాయని మచ్చగా రమేష్ బాబు చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. గతంలో తాను ప్రజల పక్షాన పోరాడితే అధికార బలంతో తప్పుడు రిజర్వేషన్ ఎస్సీ తీసుకువస్తే హైకోర్టు ద్వారా జనరల్ రిజర్వేషన్ తీసుకువచ్చి వట్టెంలా ఎంపిటిసిగా పోటీ చేసి గెలిచానని,
తనకున్న అధికార బలంతో ప్రజల పక్షాన పోరాడితే అక్రమ కేసు పెట్టి 41 రోజులు జైల్లో వేశాడని ,ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని అయినా కూడా ప్రజల పక్షాన పోరాడమని, తన పాపమే పౌరసత్వ రూపంలో ఆయనను వెంటాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పౌరసత్వం ఉండి భారత దేశ అత్యున్నతమైనటువంటి చట్టాలను మోసం చేసిన ప్రొఫెసర్ గా ఆయన చరిత్ర ఎప్పుడు మర్చిపోదని వ్యాఖ్యానించారు.
నీతి నిజాయితీగల చెప్పుకునే వ్యక్తి కి ఓటు హక్కు తొలగిస్తే కనీసం ఒక్క కార్యకర్త అయిన ఆయన గురించి మాట్లాడకపోవడం విడ్డూరమని, 15 ఏళ్లు వేములవాడ ఎమ్మెల్యేగా ఉండి కేవలం ఒక్కరంటే ఒక్క కార్యకర్తను కూడా తన వెంట సంపాదించుకోలేకపోయారని అన్నారు. దొరనే దొంగ అన్న చందంగా రమేష్ బాబు వ్యవహారం ఉందన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నప్పుడు పొందిన ప్రజాధనం వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానాల ద్వారా రమేష్ బాబు పై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు.