calender_icon.png 7 July, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని

07-07-2025 01:46:51 AM

 కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 

ఘట్‌కేసర్, జూలై 6 : అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, స్వాతంత్య్ర సమర యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో మాజీ కౌన్సిలర్ కడపోల మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అన్నారు.

స్వాతంత్య్ర సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీమన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ ఛైర్మెన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ లు అబ్బసాని యాదగిరి యాదవ్, బద్దం గోపాల్ రెడ్డి, నాయకులు కవాడి మాధవరెడ్డి, మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం. శ్రీనివాస్, సురేష్ తదితరులుపాల్గొన్నారు.