23-01-2026 12:39:03 AM
ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
ముషీరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక ఓసి కమిషన్ తోపాటు పలు డిమాం డ్ల సాధనకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఓసిల జాతీయ స్థాయి మహాధర్నా తేదీని ఫిబ్రవరి 23కు మార్చినట్టు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
గురువారం జేఏసీ కార్యాలయం లో నిర్వహించిన జాతీయ ఐకాస నాయకుల సమావేశంలో జేఏసీ జాతీయ సలహాదారు పెండ్యాల కేశవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు మహేష్ బాబు, ఉపాధ్యక్షుడు బుచ్చిరాం రెడ్డితో కలిసి అయన మాట్లాడారు.
ఈ ధర్నాలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను సైతం ఆ వర్గాల వారితోనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి రూ.10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని, ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లలో ఓసి వర్గాలవారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు ప్రభుత్వం ముందు తెలిపారు.