23-01-2026 12:39:40 AM
ఘట్ కేసర్, జనవరి 22 (విజయక్రాంతి) : జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ గురుకుల కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా యువజన క్రీడోత్సవాలు గురువారం ప్రారంభించారు. ఘట్ కేసర్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఈనెల 28 నుండి 31వరకు క్యారమ్స్, చెస్, వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడాంశాలలో పోటీలు నిర్వహించబడును.
పై ఐదు క్రీడాంశాలలో ఆసక్తిగల యువతి యువకులు జిల్లా యువజన క్రీడల శాఖ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక మానసిక వికాసానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం వంటి పనులను తెలంగాణ రాష్ట్రంలో చేపడుతుంది. ఈవిభాగం సీఎం కప్ వంటి వివిధ క్రీడా పోటీలు, యువజన సేవలు, శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఎంఈవో శ్రీధర్, విద్యుత్ ఏఈ యశ్వంత్ కుమార్, జోనల్ సెక్రటరీ శ్రీరాములు, మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.