23-01-2026 12:35:59 AM
నెమలి అనిల్ కుమార్
ఉప్పల్, జనవరి 22 (విజయక్రాంతి) : ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంమని నెమలి అనిల్ కుమార్ అన్నారు. గురువారం నాడు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో తాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై వాటర్ వరక్స్ ఏఈ శ్రీ సిరాజ్ కలిసి బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, బస్తీలో నివసిస్తున్న ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటికి శాశ్వత పరిష్కారాలు తీసుకురావడమే లక్ష్యంగా బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజ ల వద్దకే వెళ్లి వారి సమస్యలు వినడం, సం బంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కారం వచ్చే వరకు నిరంతర అనుసరణ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. అన్నపూర్ణ కాలనీలో తాగునీటి సరఫరా లోపాలు, డ్రైనేజ్ సమస్యలపై కాలనీ ప్రజలు తన దృష్టికి తీసు కువచ్చారని, వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన చర్య లు తీసుకునేలా కృషి చేస్తానని అనిల్ కు మార్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తండ్రా శ్రీకాంత్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు శేఖర్ బాబు, భాను చంద్ర రెడ్డి, పాషా, ముబీన్, ప్రసాద్, హరీష్తో పాటు కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.