calender_icon.png 25 January, 2026 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్ వైద్యుల అద్భుతం

25-01-2026 12:56:27 AM

6వ నెలలో అపెండిక్స్ పగిలినా తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడిన నిపుణులు!

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): గర్భధారణ సమయంలో తలెత్తే అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోవడంలో మెడికవర్ ఉమెన్, చైల్డ్ హాస్పి టల్స్ వైద్యులు అసాధారణ విజయాన్ని సాధించారు. 27 వారాల గర్భంతో ఉన్న ఒక మహిళకు అపెండిక్స్ పగిలి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ, అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా తల్లిని, శిశువును కాపాడారు. తీవ్రమైన కడుపునొప్పి, శరీరమంతా పాకిన ఇన్ఫెక్షన్‌తో బాధితురాలు ఆసుపత్రిలో చేరారు. ఆమెకు గతంలో రెండుసార్లు గర్భస్రావాలు జరిగా యి. రక్తం గడ్డకట్టే ఏపీఎల్‌ఏ అనే సమస్య కూడా ఉంది.

పరీక్షల్లో ఆమెకు అపెండిక్స్ పగిలిపోయిందని తేలింది. దీనివల్ల తల్లి ప్రాణానికే కాకుండా, గర్భంలోని బిడ్డకు కూ డా తీవ్ర ముప్పు పొంచి ఉంది.  మెడికవర్ వైద్య బృందం (గైనకాలజీ, సర్జరీ, అనస్థీషియా, నియోనాటాలజీ) కలిసి, ల్యాపరో స్కోపిక్ అపెండిక్టమీ శస్త్రచి కిత్స చేయాల ని నిర్ణయించారు. శస్త్రచికిత్స అనంతరం 37 వారాల 4రోజులు గర్భం పూర్తి అయ్యే వర కు నిఘాలో ఉంచారు. సిజేరియన్ ద్వారా ఆరోగ్యకరమైన శిశువు జన్మించాడు. ప్రస్తు తం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షే మంగా ఉన్నారని డా. వరలక్ష్మి (కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ప్రసూ తి నిపుణులు), డా. వెంకటపవన్ (కన్సల్టెంట్ ల్యాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్), డా. రవీందర్ రెడ్డి పరిగే (హెచ్‌వోడీ - నియోనాటా లజిస్ట్, పీడియాట్రిషియన్) వెల్లడించారు.