calender_icon.png 25 January, 2026 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడ్ మార్నింగ్ బస్తీ విత్ టీవీఆర్

25-01-2026 12:57:38 AM

ప్రజల నుంచి అనూహ్య స్పందన

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): కార్వాన్ నియోజకవర్గంలో తెలం గాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ బస్తీ విత్ టీవీఆర్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని టీఆర్పీ నాయకులు తెలిపారు. తెలం గాణ రాజ్యాధికార పార్టీ కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పార్టీలో చేరారు. కార్వాన్ నియోజక వర్గం నుంచి మొత్తం 50 మంది మహిళలు టీఆర్పీ పార్టీలో చేరారు.

ఇందులో 30 మంది బీజేపీ నుంచి, 20 మంది ఎంఐఎం నుంచి ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో ప్రేమలత, మమత, సరిత, రాధిక, సంగీత, రత్నమ్మ, పద్మ, అనురాధ, రేణుక, అరుణ, రాణి, కల్పన, సుధారాణి, వాణి, శ్రావణి, శోభ, అనిత, సల్మా బేగం, అఫీషా బేగం, నైకాన్ బేగం ఉన్నారు. గుడ్ మార్నింగ్ బస్తీ విత్ టీవీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించి కేవలం రెండు, మూడు రోజుల్లోనే బస్తీల్లో ప్రజలు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని, దీంతో ప్రజలు ప్రత్యేకంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నాయకులు తెలిపారు.