25-01-2026 12:55:25 AM
బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఘటన
ముమ్మరంగా పనులు
సంగారెడ్డి, జనవరి 24(విజయక్రాంతి) : సంగారెడ్డి బైపాస్ రోడ్ విస్తరణ పనులు గత రెండు రోజులుగా చురుకుగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఆర్డీఓ ఇల్లు, ఆర్ అండ్ బీ ప్రహరీని కూల్చివేశారు. శనివారం సాయంత్రం జగ్గారెడ్డి స్వయంగా విస్తరణ పనులను పర్యవేక్షించారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి బసవేశ్వర విగ్రహం వరకు రోడ్ వెడల్పు కోసం సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇవ్వడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి రూ.12 కోట్ల నిధులను మంజూరు చేశారని జగ్గారెడ్డి వివరించారు.
రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రశాంత్ నగర్ కాలనీ, ఇందిరా కాలనీ, విజయ్ నగర్ కాలని, డ్రైవర్స్ అసోసియేషన్ కాలనీ, బాలాజీ నగర్ కాలనీ, రెవెన్యూ కాలనీ, బ్యాంకర్స్ కాలనీ, అయ్యప్ప కాలనీ, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ కాలనీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అదే విధంగా కొత్త బస్టాండ్ నుండి ఐబి మీదుగా బసవేశ్వర చౌరస్తా, కొండాపూర్, సదాశివపేటకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బం దులు తప్పుతాయని జగ్గారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఎ, మున్సిపల్, విద్యుత్ అధికారులతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు బొంగుల రవి, రఘు గౌడ్, జార్జ్, కూన సంతోష్, తదితరులు పాల్గొన్నారు.