18-12-2025 02:08:20 AM
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో పోటీ
ఖమ్మం, డిసెంబరు 17 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో ఒకే ఇంట్లోని రక్తసంబంధీకుల మధ్య పోటీ నెలకొంటోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేంద్రంలో తల్లికూతుళ్లు సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగారు. తేజావత్ సామ్రాజ్యం, బానోతు పాప తల్లికూతుళ్లు. వీరిరువురు పెనుబల్లి మండల కేంద్రంలోనే నివాసం ఉంటున్నారు. సామ్రా జ్యం దాదాపు 20 ఏళ్ల నుంచి వార్డు మెంబర్‌గా కొనసాగుతున్నారు. తల్లి నుంచి రాజకీ య పాఠాలు నేర్చుకున్న బానోతు పాప, ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో మొదటిసారి తన అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోనుంది. సామ్రాజ్యాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ బలపరచగా, పాప బీఆర్‌ఎస్ తరఫున పోటీకి దిగింది.