18-10-2025 01:09:49 AM
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధార’. సోనాక్షి సిన్హా ధన పిశాచి గా అలరించనున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ ముఖ్యపాత్రల్లో నటిస్తు న్నారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 7న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ హీరో మహేశ్‌బాబు శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం ఈవెంట్ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. “చిన్నప్పుడు విన్న ‘ఓ స్త్రీ రేపు రా’, ‘లంకె బిందెలు కదలి’ వంటి విషయాలు విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. వెంకట్ వచ్చి కథ చెప్పినపుడు అదే థ్రిల్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా అదే థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. చాలా మంచి భావోద్వేగాలుంటాయి. సినిమా అద్భుతంగా రావడానికి కారణమైన టీమ్ అందరికీ థాంక్యు. సోనాక్షి చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు.
ధన పిశాచి పవర్‌ఫుల్ రోల్. సోనాక్షి మరింత పవర్‌ని యాడ్ చేశారు. డైరెక్టర్ వెంకట్ అభిషేక్‌కి ఇది ఫెంటాస్టిక్ డెబ్యూ. క్లాస్, మాస్ అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. సినిమా ఒక దమ్ బిర్యానీలా తయారైంది. ప్రేక్షకులు పెట్టే డబ్బు, సమయం విలువను దృష్టిలో ఉంచుకొని తీసే సినిమా 100% బ్లాక్‌బస్టర్ అవుతుంది. ‘జటాధర’ కూడా 100% బ్లాక్‌బస్టర్” అన్నారు. సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. “ఇది నా తొలి తెలుగు సినిమా. చాలా ప్రత్యేకం. ఇంత అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ‘జటాధర’ అందరికీ నచ్చుతుంది. సుదీర్‌బాబుతో కలిసి నటించడం అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. ధన పిశాచి లాంటి రోల్ ఇప్పటివరకూ చేయలేదు. ఒక నటిగా ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది” అని చెప్పారు.
“బ్రహ్మ’ నా ఫస్ట్ తెలుగు రిలీజ్. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ‘జటాధర’తో రావడం చాలా హ్యాపీగా ఉంది. మహేశ్‌బాబు ట్రైలర్ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇండస్ట్రీలోకి మళ్లీ వెల్‌కమ్ చేశారు. అది మాకు చాలా స్పెషల్” అని శిల్పా శిరోద్కర్ తెలిపారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ మాట్లాడుతూ.. “కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం. అందరూ గట్టిగా ఎంజాయ్ చేస్తారు. ఇది 100% గ్యారంటీ. ఈ ఏడాదికి ఇది ఫెంటాస్టిక్ ఫిల్మ్ అవుతుందని నమ్మకం ఉంది” అని తెలిపారు. నిర్మాతలు ఉమేశ్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ మాకు చాలా స్పెషల్. ట్రైలర్ ఇక్కడ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం” అన్నారు.