calender_icon.png 19 October, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కింగ్‌తో మరోసారి!

18-10-2025 01:11:05 AM

కొంత విరామం తర్వాత చిరంజీవి సినిమాతో మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీకి సిద్ధమైంది నయనతార. ‘మన శంకరవరప్రసాద్ గారు’ పేరుతో అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. నయన్ నుంచి ‘మూకుత్తి అమ్మన్2’ కూడా రావాల్సి ఉంది. ఈ సినిమాకు సుందర్ సీ దర్శకత్వం వహిస్తుండగా, డాక్టర్ ఇషారి కే గణేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇదిలా ఉండగా, నయన్ తెలుగులో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

అక్కినేని నాగార్జున తన 100వ సినిమాను ఇటీవలే పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.  తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌తో రానుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నాగార్జున జంటగా టబు నటించబోతోందని ఇటీవల వార్తలు వచ్చాయి.  కానీ, ఆరోగ్య కారణాల దృష్ట్యా టబు ఈ ప్రాజెక్టుకు దూరమవుతున్నారనేది తాజాగా అందుతున్న సమాచారం. దీంతో ఆ స్థానాన్ని నయనతారతో భర్తీ చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. నాగ్ కలయికలో గతంలో ‘బాస్’ సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితం మాట అటుంచితే.. ఈ జంట మాత్రం తెరపై ప్రేక్షకులను అలరించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం అవుతుంటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.