calender_icon.png 17 August, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినోద పరిశ్రమలో కొత్త శకం

30-08-2024 12:00:00 AM

డిస్నీ డీల్‌పై అంబానీ

డిస్నీతో తాము నెలకొల్పనున్న జాయింట్ వెంచర్ భారత వినోద పరిశ్రమలో కొత్త శకాన్ని ప్రారంభిస్తుందని ముకేశ్ అంబానీ తెలిపారు. డిస్నీ, రిలయన్స్ మీడియా రూ.70,000 కోట్ల విలీన ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కంటెంట్ క్రియేషన్‌ను డిజిటల్ స్ట్రీమింగ్‌తో కలుపుతామని, ప్రపంచస్థాయి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తామని చెప్పారు.  రిలయన్స్ కుటుంబంలోకి డిస్నీని ఆహ్వానిస్తున్నామని, తమ జియో, రిటైల్ వ్యాపారాల్లానే, మీడియా వ్యాపారం సైతం రిలయన్స్ వృద్ధి కేంద్రంగా అవతరిస్తుందన్నారు.