calender_icon.png 10 November, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు మొత్తం చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

10-11-2025 05:06:11 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి):కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో సిరిసిల్ల జిల్లాలో 3948, విద్యార్థులున్నారు. వీరందరి పక్షాన పరీక్ష ఫీజు మొత్తాన్ని బండి సంజయ్ చెల్లించారు. కేంద్ర మంత్రి తరపున కరీంనగర్ జిల్లాలో చదివే విద్యార్ధలు పరీక్ష ఫీజు మొత్తాన్ని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి చెక్ రూపంలో అందజేశారు.

అట్లాగే సిరిసిల్ల జిల్లా అధ్యక్షలు రెడ్డబోయిని గోపీ ఆధ్వర్యంలో జిల్లా నేతలు గరీమా అగర్వాల్ ను కలిసి చెక్ అందజేశారు. సిద్దిపేట జిల్లా విద్యార్థుల పక్షాన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు హనుమకొండ జిల్లాల విద్యార్థుల పక్షాన ఆయా జిల్లాల బీజేపీ నేతలు ఆయా కలెక్టర్లను కూలిసి పరీక్ష ఫీజు మొత్తాన్ని చెక్ రూపంలో అందజేయడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్రరేఖకు దిగువన ఉన్నవారే కావడం, వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష ఫీజు కూడా చెల్లించలేకపోతున్నారని తెలుసుకున్న బండి సంజయ్ ఈ మేరకు తన వేతనం నుండి ఆ మొత్తాన్ని చెల్లిస్తానని ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.

అనుకున్నట్లుగా ఆ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. అతి త్వరలోనే ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో సర్కారీ స్కూళ్లలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకు  సైతం సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అట్లాగే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే ‘మోదీ కిట్స్’ పేరుతో 1 నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ ను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.