calender_icon.png 10 November, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు

10-11-2025 05:08:33 PM

రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

మానకొండూరు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీ తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించారని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ సృష్టికర్త అందె శ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని, యావత్ తెలంగాణ ప్రజానీకానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పోలాడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

అందె శ్రీ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని జయ జయహే తెలంగాణ గేయ రూపంలో రచించిన గీతం యావత్ తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందని నివాళులు అర్పిస్తూ అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ దుఃఖ సాగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రజా సంఘాల తరపున, వ్యక్తిగతంగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భాగ్యనగరంలోని టాంక్ బండ్ పై అందెశ్రీ జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో స్మృతి వనం నిర్మించి నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామారావు విజ్ఞప్తి చేశారు.