19-11-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: దేశీయ పౌర విమాన రంగం లో సరికొత్త రికార్డు నమోదైంది. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఒక్కరోజులో 5 లక్షలు దాటింది. నవంబర్ 17న (ఆదివా రం) ఈ రికార్డు నమోదైంది. దేశీయంగా ఒకే రోజులో ఈ స్థాయిలో ప్రయాణికుల సంఖ్య ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మొ త్తం 5,05,412 మంది ప్రయాణికులు విమా న ప్రయాణం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తొలిసారి 5 లక్షల మార్కును దాట డం గమనార్హం. ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి పండగలు, వివాహ వేడుకలే కారణమని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబు తున్నారు. ఈ వింటర్ సీజన్‌లో ఇదే ఒరవడి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ క్లియర్ ట్రిప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ పట్వారీ ఆశాభావం వ్యక్తంచేశారు.
అక్టోబర్ 27 నుంచి 2025 మార్చి 29 వరకు వింటర్ సీజన్ కొనసాగుతుంది. డీజీసీఏ షెడ్యూల్ ప్రకారం.. ఈ సీజన్లో వారంలో 25,007 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి.