calender_icon.png 21 January, 2026 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొరపాటు సరిదిద్దుకున్న ఫాక్స్‌కాన్

19-11-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత్‌లో టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల సప్లయర్ ఫాక్స్‌కాన్ తమ వద్ద నియామకాల్లో పాల్గొనే మధ్యవర్తులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో ఇకనుంచి వయసు, లింగం, వైవాహి క స్థితి వంటి అంశాలను పేర్కొనవద్దని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.

వివాహితులను ఉద్యోగాల నుంచి తీసివేస్తోందంటూ ఫాక్స్‌కాన్ కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిం దే. అవివాహితులతో పోలిస్తే గృహిణులకు అదనపు బాధ్యతలు ఉండటాన్ని సాకుగా చూపుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై కేంద్రప్ర భుత్వం కూడా స్పందించింది.

ప్రాంతీయ చీఫ్ లేబర్ కమిషనర్‌ను ఇందులో వాస్తవాలను పరిశీలించి తమకు తెలియజేయాలని పేర్కొంది. నాడు విమర్శలపై స్పందించిన యాపిల్, ఫాక్స్‌కాన్.. 2022లో నియామకాల సమయంలో హెచ్‌ఆర్ పాలసీలో లోపాలు ఉన్నాయని.. వాటిని మెరుగుపర్చామని వివరణ ఇచ్చాయి.

ఈ సంఘటన తర్వాత ఫాక్స్‌కాన్ రిక్రూట్ ప్రకటనల్లో మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. కార్మికుల కోసం ఏజెంట్లపై ఆధారపడుతున్న సం స్థ.. ఇకనుంచి ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వయసు, వైవాహిక స్థితితో పాటు తయారీదారు పేరును తీసివేయాలని ఆదేశించింది.