calender_icon.png 3 January, 2026 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం తాగి గలాటా సృష్టించిన వార్డెన్ సస్పెండ్

03-01-2026 12:00:00 AM

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

సిర్గాపూర్, జనవరి 2 : సిర్గాపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ పి.కిషన్ నాయక్ ను శుక్రవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సిర్గాపూర్ హాస్టల్లో రోజు వచ్చి మద్యం సేవించి విద్యార్థులకు ఇష్టానుసారంగా మాట్లాడడంతో పాటు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహించడం,15 రోజుల నుంచి హాస్టల్ లో విద్యుత్ సరఫరా రాకపోవడంతో పాటు, నీళ్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వార్డెన్ మద్యం సేవించి విద్యార్థులకు హాస్టల్ పైనుంచి పడిస్తానని  బెదిరించడంతో పాటు, విద్యార్థుల కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడడం, హాస్టల్ లో రోజు మద్యం తాగి ఇబ్బందులకు గురి చేయడంతో గురువారం రాత్రి విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో శుక్రవారం అధికారులు, తహసీల్దార్ హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యల గురించి అడిగి తెలుసుకొని సంగారెడ్డి కలెక్టర్ కు తెలిపారు. దీంతో  హాస్టల్ వార్డెన్ పి.కిషన్ నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.