calender_icon.png 24 July, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి

23-07-2025 07:55:30 PM

మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ..

మణుగూరు (విజయక్రాంతి): పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) తప్పిదం వల్లనే మండల ప్రజలకు విపత్తు సంభవించిందని, ప్రతి సంవత్సరం ప్రజలు వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు పడుతున్న వరద నివారణపై ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ ప్రశ్నించారు. మంగళవారం ఆమె సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నెరవితో కలసి ముంపునకు గురైన ఆదర్శనగర్, సుందరయ్య నగర్, కాళీమాత ఏరియా, బాలాజీ నగర్, వినాయక నగర్ లలో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

విపత్కర పరిస్ధితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించాల్సిన పాలకులు ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. కోట్లాది రూపాయల  అభివృద్ధి చేస్తు న్నామని చెబుతున్న పాలకులు ప్రతి సంవత్సరం కట్టవాగు, మెట్టవాగు వరదలతో ముంపుకు గురయ్యే  ప్రజలను ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. హడావుడిగా చేసిన వాగు పనులతో చెత్త పేరుకుపోయి నీరు ముందుకు కదలని పరిస్థితి నెల కొందన్నారు. మంగళవారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంత ప్రజలు మరోసారి నిరాశ్రయులుగా మారారన్నారు. ఇప్పటికైనా వారికి వరదల నుండి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.