24-07-2025 01:10:54 AM
మంచి ఉద్దేశం.. గ్రాంట్లు దుర్వినియోగం
నియోజకవర్గాల స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులు పక్కదారి
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులు కేటాయించింది. ఈ నిధులు దుర్వినియోగమవుతున్నాయని, మార్గదర్శకాలకు వి రుద్ధంగా రూ.1,190 కోట్ల నిధులతో పనులు చేస్తున్నారని, దీనిపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌తో విచారణ చేయించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశా రు.
ప్రజలకు అక్కరకు రాని, ప్రజలకు అవసరమైన ‘స్పెషల్’ పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తున్నాని పేర్కొన్నారు. సీఎంకు రాసిన లేఖ లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.
రూ.1,190 కోట్లకు జీవోలు.. మార్గదర్శకాలు
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రూ.1,190 కోట్లు కేటాయిస్తూ.. 2024, జనవరి 30వ తేదీన జీవో నెం.22 ద్వారా పరిపాలనా అనుమతులిచ్చింది. జీవో నెంబర్ 299 (తేదీ 25.11.2024)తో జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తూ నిధుల ఖర్చుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను పేర్కొంది.
వీటి ప్రకారం రూ.10 కోట్ల లో రూ.2 కోట్లు పాఠశాలల అవసరాలకు, రూ. కోటి తాగునీటి పనులకు, రూ.50 లక్షలు కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల రిపేర్లకు, మిగిలిన రూ.6.5 కోట్లు ఇతర అభివృద్ధి పనులకు 2023 ఆర్థిక సంవత్సరంలో విని యోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే ప్రతిపాదనలు.. ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో..
ఈ మార్గదర్శకాల ప్రకారం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే అవసరమున్న అభివృద్ధి పనుల జాబితా ఇవ్వాలి. దాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మంజూరు చేయాలి. తర్వాత జిల్లా కలెక్టర్ సంబంధిత ఇంజినీరింగ్ విభాగాలతో పనులు చేయించాలి. అయితే ఈ మార్గ దర్శకాలకు అనుగుణంగా రూ.1,190 కోట్ల పనులు అమలు కావడం లేదు. దీంతో ప్రజాధనం వృథా అవుతోంది.
ఉదాహరణలు..
* దేవరకొండ ఎమ్మెల్యే తన నివాసంలో మ రమ్మతు, రినోవేషన్, ఫర్నిచర్, ఏసీలు, టీవీ ల కోసం రూ.1.14 కోట్లు ప్రపోజల్ పంప గా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మంజూరు చేశా రు. ఎటువంటి అభివృద్ధి లేని దుబారా ఖ ర్చు పనులకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఏ విధంగా మంజూరు ఇచ్చారో తెలియదు. ఇ టువంటి దుబారా ఖర్చుల మంజూరు చాలా జిల్లాల్లో జరుగుతుంది.
* పీడబ్ల్యూడీ నిబంధనల ప్రకారం ఏ పనై నా రూ.5 లక్షలకు మించితే ఆ పనికి టెం డర్లు పిలిచి చేయించాలి. కానీ పెద్ద పనిని కూడా ముక్కలుగా చేసి నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వారికి అప్పజెబు తున్నారు. సంబంధిత శాఖ ఇంజినీర్లు ఈ విధంగా నామినేషన్ పద్ధతితో పనులు చేయించడంతో నాణ్యత లోపించి ప్రజాధనం వృథా అవుతోంది.
* సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనులను సూచించాలి. కానీ కరీంనగర్‌లో ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇ చ్చిన ప్రతిపాదనలు జిల్లా ఇన్‌చార్జి మం త్రి మంజూరు చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మె ల్యేను కాదని, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతిపాదనలకు జిల్లా ఇన్ చార్జి మంత్రి మంజూరు చేశారు.
* ప్రాధాన్యత లేని పనులను మంజూరు చే స్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీరు, గ్రామాల్లో డ్రైనేజీ వం టి అవసరాలున్నా యి. కానీ వాటిని పక్కనపెట్టి గ్రామాల్లో 50 హైమాస్ట్ లైట్లకు రూ.60 లక్షలతో మంజూరు ఇచ్చారు. అ లాగే 25 గ్రామాల్లో ఓపెన్ జిమ్‌కు రూ. 1.25 కోట్లతో మంజూ రు ఇచ్చారు. ఈ పనుల కోసం ఎటువంటి టెం డర్లు పిలవలేదు. అన్ని పనులు నామినేషన్ ప ద్ధతిలో కావాల్సిన వారి కి ఇచ్చారు. మంచి ఉద్దేశంతో గ్రామాల అభివృ ద్ధి కోసం రూ.1,190 కోట్లు మంజూరు చేస్తే.. ఇందులో డబ్బు దుర్వినియోగం అవుతోంది. ఈ విషయంలో విజిలె న్స్ డైరెక్టర్ జనరల్‌తో విచారణ జరిపించాల ని, అలాగే పనుల మం జూరు అధికారం కలెక్టర్లకు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌరవ ముఖ్యమంత్రిని కోరుతుంది.