23-07-2025 07:53:30 PM
నివాళులర్పించిన వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్.
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ఆశా కార్యకర్త గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి(43) బుధవారం గుండెపోటుతో మృతి చెందడంతో మండల వైద్యాధి కారి గొట్టే శ్రావణ్ కుమార్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆశ కార్యకర్తగా మాతంగి భాగ్యలక్ష్మి గ్రామస్తుల క్షేమం కోసం పాటుపడుతూ పనిచేస్తుంది అనిఆమె మరణం తీరని లోటు అని శ్రవణ్ కుమార్ అన్నారు.