25-09-2025 01:24:53 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): నగరంలో నెలకొన్న నాలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి భరోసా ఇచ్చారు. మంగళవారం యూసుఫ్‌గూడ, షేక్‌పేట డివిజన్లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిలతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని కృష్ణానగర్‌లో తరచూ ఎదురవుతున్న వరద ముంపు సమస్యపై మంత్రులు దృష్టి సారించారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఈ ప్రాంతం జలమయమవడానికి గల కారణాలను అధి కారులతో కలిసి పరిశీలించారు.
నాలాలు ఇరుకుగా ఉండటం బాటిల్ నెక్ సమస్య వల్లే వరద నీరు వెనక్కి తన్ని కాలనీలు మునిగిపోతున్నాయని గుర్తించారు. భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా, ప్రస్తు త నాలాల అభివృద్ధి పనులను ఎస్‌ఎన్‌డీపీ కి అప్పగించినట్లు మంత్రులు తెలిపారు. అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్, ఓయూ కాలనీలో పర్యటించారు. డివిజన్‌లో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మంత్రులకు వివరించారు.
రహమత్ నగర్‌లో యూడీఐడీ క్యాంప్
బుధవారం జూబ్లీహిల్స్ డివిజన్, రహమత్ నగర్‌లోని హెచ్‌ఎఫ్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక యూడీఐడీ సదరం క్యాంపును కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో దివ్యాంగుల పరికరాల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.64 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.50 కోట్లు వెచ్చించి ట్రై-మోటరైజ్డ్ స్కూటర్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు వంటి అనేక ఉపకరణాలు కొనుగోలు చేసిందని చెప్పా రు.
మంత్రి గడ్డం వివేక్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో వికలాంగులు సద రం సర్టిఫికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారని, పదేళ్లలో ఒక్క ప్రత్యేక క్యాంపు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం ఆధార్ కార్డు, ఫొటోలతో వస్తే, అక్కడికక్కడే వైద్య పరీక్షలు చేసి యూడీఐడీ కార్డులు ఇవ్వ డం చారిత్రకమని కొనియాడారు. ఈ ఒక్క క్యాంపులోనే 700 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం ప్రజా పాలనకు నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమం ఏర్పాట్లను పర్య వేక్షించిన స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, గ్రం థాలయ సంస్థ చైర్మన్ రియాజ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ రాజేందర్‌లు పాల్గొన్నారు.