09-12-2025 10:45:50 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని పొనుగోడు గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన జలగం సిద్దయ్య(45) అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కల్టివేటర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సిద్దయ్యను ఆసుపత్రికి 108లో తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్లు తెలిపారు.
సిద్దయ్య గడ్డిపల్లి నుంచి గరిడేపల్లి వైపుకు మోటార్ సైకిల్ పై వస్తుండగా ముందుగా కల్టివేటర్ తో వెళుతున్న ట్రాక్టర్ ను ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయిన సిద్దయ్య అప్పన్నపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నారు. ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో సిద్దయ్య చనిపోవడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.