calender_icon.png 11 December, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు గ్రామాలు ఒకే నిర్ణయం.. సర్పంచ్‌లు ఏకగ్రీవం

09-12-2025 10:42:12 PM

ప్రజాస్వీకారం స్పష్టం..

కుభీర్ మండలంలో వరుసగా ముగ్గురు సర్పంచ్‌లు ఏకగ్రీవ ఎన్నిక..

కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని మూడు గ్రామాల సర్పంచ్‌లను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఆయా గ్రామాలలో ఒక్కొక్కరే నామినేషన్ లు దాఖాలు చేయడంతో పోటీ లేకుండపోయింది. కాగా పల్సి తాండ సర్పంచ్‌గా ఆడే అర్జున్, బ్రహ్మేశ్వర్ సర్పంచ్‌గా రాథోడ్ రేఖ బాయి, ఉపసర్పంచ్‌గా దారవత్ అశ్విన్, జాంగామ్ సర్పంచ్‌గా మాంకుర్ నవనీత, ఉప సర్పంచ్‌గా మగమా రాజేశ్వర్ లు ఎన్నికైనట్లు మండల ఎన్నికల అధికారి ఎంపీడీవో సాగర్ రెడ్డి తెలిపారు. వార్డు సభ్యుల వివరాలు రాత్రి వరకు తెలియవస్తుందని ఆయన వివరించారు.