09-12-2025 10:49:29 PM
సోనియా జన్మదిన వేడుకల్లో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను యూపీఏ చైర్పర్సన్ గా సోనియాగాంధీ అర్ధం చేసుకుని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ అన్నారు. మంగళవారం ఇచ్చోడ లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల త్యాగాలు చూసి చలించిపోయి పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని వారు కొనియాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన దేవత అన్నారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సత్యవతి కోటేష్, కళ్లెం నారాయణరెడ్డి, మైనార్టీ సెల్ చైర్మన్ ముస్తఫా, ఎస్సీ సెల్ చైర్మన్ కొత్తూరు లక్ష్మణ్, ST సెల్ మండల అధ్యక్షులు నైతం నాగరాజు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రషీద్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, సీనియర్ నాయకులు షేక్, మహబూబ్, సాదిక్, షేక్ మహబూబ్, రసూల్ ఖాన్, షేక్ అహ్మద్ తదితరులు ఉన్నారు.