09-02-2025 07:35:29 PM
తప్పించుకుని తిరుగుతున్న మహారాష్ట్ర స్మగ్లర్లు అరెస్ట్...
సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చందర్...
సంగారెడ్డి (విజయక్రాంతి): అక్రమంగా గంజాయి తరలిస్తు తప్పించుకుని తిరుగుతున్న స్మగ్లర్ ను అరెస్టు చేశామని సంగారెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చందర్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు సమావేశంలో మాట్లాడారు. 220 కేజీల గంజాయి, నిందితుని అరెస్ట్ చేశామన్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు మహారాష్ట్రలో దాగి ఉన్నటువంటి గంజాయి నిందితులను అరెస్టు చేశామన్నారు. సంగారెడ్డి, పటాన్ చెరు పోలీసులు మహారాష్ట్రలో స్మగ్లర్ ను అరెస్ట్ చేశామన్నారు.
2024వ సంవత్సరంలో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన 220 కేజీల గంజాయి కేసులో స్మగ్లర్ ను మహారాష్ట్రలో అరెస్టు చేశారని తెలిపారు. 220 కిలోల గంజాయి కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు అయిందన్నారు. అమర్ సంజయ్ కావాల్, దిలీప్ ఆగాడలను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను పట్టుకొచ్చిన టీంలో పటాన్ చెరు ఎస్హెచ్వో పరమేశ్వర్ గౌడ్, డిటిఎఫ్ సిఐ హనుమంతులు ఇతర సిబ్బంది ఉన్నారు.