calender_icon.png 22 November, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక పరిస్థితి సరిగా లేక అనారోగ్యంతో మహిళ మృతి...

09-02-2025 07:38:13 PM

పాపన్నపేట: మానసిక పరిస్థితి సరిగా లేక అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు వివరాలు.. నల్గొండ అడవిదేవునిపల్లికి చెందిన లక్ష్మీకోటేశ్వరీ(74) తన భర్త మానసిక పరిస్థితి సరిగా లేక తీర్థ యాత్రలకు తిరుగుతూ ఉంటుండేది. గత పదిహేను రోజుల క్రితం మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల ఆలయం వద్దకు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతూ... శనివారం రాత్రి సమయంలో ఆలయ సమీపంలో మృతి చెందింది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లక్ష్మీ కోటేశ్వరీగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కొడుకు త్రివిక్రమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.