14-08-2025 12:10:19 AM
పటాన్ చెరు(అమీన్ పూర్), ఆగస్టు 13 : డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరు పని చేయాలని అమీన్ పూర్ కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జ్యోతిరెడ్డి బుధవారం మున్సిపల్ అధికారులు,
సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోదానికి ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత సమాజాన్ని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు, రవాణ చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.