14-08-2025 12:08:58 AM
ఖానాపూర్ ఆగస్టు 13: నిర్మల్ మంచిర్యాల రహదారిపై కడెం జన్నారం ఉట్నూర్ మధ్య ఉన్న కవ్వల్ అభయ అరణ్యంలో భారీ లోడు వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ అన్నారు.
బుధవారం భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే జన్నారం నుంచి కడెం వరకు లారీలో ప్రయాణం చేసి లారీ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ లోడ్ వాహనాలకు రాత్రి వేళలో అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడేవని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కడెం జన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.