31-12-2025 01:58:42 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నందినగర్‌లోని ఆయన నివాసంలో ఉన్నారు. దీంతో కేసీఆర్ కలిసేం దుకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలు నందినగర్ రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులతో నందినగర్ నివాసం సందడిగా మారింది. రెండు రోజులుగా తనను కలిసేందుకు వస్తున్న అభిమానులందిరికీ ఓపికగా గంటల తరబడి ఫొటోలకు కేసీఆర్ అవకాశం కల్పించారు.
ఒక్కసారైనా కేసీఆర్‌తో ఫొటో దిగాలనే తమ కోరిక నెరవేర డంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు వారికి గులాబీ బాస్ సమ యం కేటాయించి, వెయ్యికి పైగా మందితో ఫొటోలు దిగారు. క్యూ కట్టి ఒక్కొక్కరిగా వచ్చి ఆయనను కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా.. ‘కేసీఆర్‌ను కళ్లారా చూడడం జీవితంలో దక్కిన గొప్ప వరం.
ఈ జన్మకి ఇదే చాలు.. ఇంకేం అక్కర్లేదు సార్!’ అంటూ ఓ అభిమాని చెప్పిన మాటలు అక్కడున్న వారిని కదిలించాయి. మరో కార్యకర్త మాట్లాడుతూ.. ‘ఆయనతో ఫొటో దిగడం అదృష్టం గా భావిస్తున్నాం. కేసీఆర్ మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించాలి’ అని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను కలవడంపై పార్టీ శ్రేణుల్లో అభిమానం ఉప్పొంగింది.

శతమానం భవతీ.. సుమన్
తన అభిమాని కుమారునికి కేసీఆర్ నామకరణం
తన కుమారునికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదించి, పేరు పెట్టాలని ఎదురుచూసిన తెలంగాణ ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి పవిత్ర దినం నాడు ఫలించింది. పరిగి నియోజక వర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామ నివాసి దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమ కారుడు. నర్సింహులు దంపతులు తమ ప్రియతమ నేత కేసీఆర్‌తో తన కనిష్ట కుమారునికి నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా...బాబు పుట్టిన తొమ్మిది నెలల నుంచి ఎదురుచూస్తున్న వారి ప్రయత్నం, వైకుంఠ ఏకాదశినాడు ఫలించింది.
మంగళవారం వారు నందినగర్ నివాసానికి వెళ్లారు. కుటుంబంతో వచ్చిన దొడ్ల నర్సింహులు అనిత దంపతులను అధినేత కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ ఉద్యమ దంపతుల కోరికను మన్నించి, వేద పండితుని సలహాతో, బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన, ‘సు’ అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమన్’ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి, సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆశీర్వదించారు.