31-12-2025 01:24:31 AM
జపాన్‌ను వెనక్కి నెట్టి స్థానంలోకి ఇండియా
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భారత్ ప్రపంచంలోనే నాలు గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌ను వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ తద్వారా అమెరికా, చైనా, జర్మనీ తర్వాతి స్థానాన్ని పదిలపరుచుకున్నది. దీంతో జపాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకో వాల్సి వచ్చింది. భారత్ 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీవో జర్మనిని కూడా అధిగమించి మూడోస్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
భారత ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసిం ది. ప్రస్తుతం భారత జీడీపీ విలువ 4.18 ట్రిలియన్ డాల ర్లు. దేశ ఆర్థిక వ్యవస్థ 2025- -26 రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి సాధించింది. ఇది గత ఆరు త్రైమాసికాల్లోనే అత్యధిక వృద్ధి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
గణనీయయంగా దేశీయ వృద్ధి, పటి ష్టమైన సంస్కరణలతోనే భారత్ నాలుగోస్థానానికి చేరుకోగలిగింది. ప్రపంచ ఆర్థిక సంస్థలైన వరల్డ్ బ్యాంక్, ఐఎం ఎఫ్ సైతం భారత ఆర్థికాభివృద్ధిపై సానుకూలంగా ఉన్నా యి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, నిరుద్యోగిత తగ్గడం వంటి అంశాలు దేశానికి కలిసొచ్చాయి.