calender_icon.png 31 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఎస్‌ఐ బిల్లులు 40 కోట్లు విడుదల!

31-12-2025 01:42:53 AM

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు కొనుగోలు చేసిన మందులు, డ్రగ్స్, సర్జికల్స్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింది. ‘విజయక్రాంతిదినపత్రికలో ఈనె ల 26న ‘పీఎంఓకే డబుల్ మస్కా!’ 28న ‘ఈఎస్‌ఐ నిధులు భోజ్యం!వార్తా కథనాలకు రాష్ట్ర ప్రభు త్వం స్పందించింది. ఈఎస్‌ఐ మందుల బి ల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను పెండింగ్ పెడుతూ వస్తోంది.

కేంద్రం నిధు లు ఇస్తున్నా కానీ, వాటిని విడుదల చేయడంలో తాత్సారం చేస్తోందంటూ వచ్చిన వార్తా కథనాలకు ప్రభుత్వం దిగొచ్చింది. ఈ విషయం పీఎంవో దృష్టికి పోతే పరువు పో తుందనే భావనతో ఎట్టకేలకు బిల్లులను విడుదల చేసినట్లుగా తెలిసింది. ఈక్రమంలోనే పెండింగ్‌లో ఉన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 25 కోట్లు, 2025-26 సంవత్సరానికి సంబంధించిన బిల్లులు రూ.15 కోట్లతో కలిపి మొత్తం రూ.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

అయితే, గతంలోనే ఈ బిల్లులకు సంబంధించిన టోకెన్లను జారీ చేసి డబ్బులను ప్రభుత్వం మస్కా కొట్టింది. దీంతో ‘విజయక్రాంతి’లో వచ్చిన రెండు వరుస కథనాలతో అటు ప్రభుత్వ, ఇటు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరగడంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.