31-12-2025 01:31:32 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ శాసన సభా శీతాకాల సమావేశాలు ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ, శాసన మండలిలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. శాసన సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా తన్నీరు హరీశ్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు అవకాశం కల్పించారు.
శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది.