calender_icon.png 24 October, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన సంఘటన

24-10-2025 12:00:00 AM

5 కేజీల బాల భీముడికి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జన్మనిచ్చిన తల్లి రాణి

తల్లిబిడ్డా క్షేమం, భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ వెల్లడి

భద్రాచలం, అక్టోబర్ 23, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మధ్యా హ్నం అడుగైన ఘటన చోటు చేసుకుంది, మణుగూరు పట్టణానికి చెందిన, జోగునూరు బాబు, అతని భార్య అయిన జోగునూరు రాణి కి పురిటి నొప్పులు రావడంతో, మణుగూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గర్భిణీ స్త్రీ అయిన రాణి కి, షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు,

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, వెనువెంటనే ఆపరేషన్ నిర్వహించి పండంటి మగ బిడ్డకు కాన్పు చేశారు, పుట్టిన మగ బిడ్డ బరువు చూడగా ఒక్కసారిగా హాస్పటల్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

పుట్టిన మగ బిడ్డ ఐదు కేజీలు ఉండి బాల భీముడులా ఉండటం కాన్పు చేసిన డాక్టర్, మరియు సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు, అనంతరం తల్లి బిడ్డను పరీక్షించిన వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇలాంటి ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగటం ఎంతో ఆనందంగా ఉందని, పేద ప్రజలందరూ ప్రభుత్వ సేవలు వినియోగించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేపించుకోవాలని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ అన్నారు.