31-07-2024 12:42:31 AM
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): వలంటీర్లపై వ్యాఖ్యల కేసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును క్యాష్ చేయాలని పవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారించిన ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులను ప్రభుత్వం రివిజన్ చేస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు నాలుగు వారాలకు కేసును వాయిదా వేసింది.