calender_icon.png 11 November, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన ప్రాంతాల్లో డోలీలు కనిపించొద్దు !

31-07-2024 12:47:56 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల్లో ఇకపై గర్భి ణులను తీసుకెళ్లేందుకు డోలీలు కనిపిం చొద్దని, గర్భిణుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అవసరమైతే ట్రైకార్, జీసీ సీ, ఐటీడీఏలను వినియోగించుకోవాలని సూచించారు. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం  గిరిజ న సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవస్థలను  నిర్వీర్యం చేసిందన్నారు.

ఫలితంగా గిరిజనుల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆరోపించారు. వారికి మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వారి కోసం తిరిగి ఫీడర్ అంబులెన్స్‌లను ప్రవేశ పె ట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వం గిరిజ న విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అం బేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలేబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.