calender_icon.png 20 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లింగంపల్లి వాసి

20-12-2025 01:53:31 AM

నూతనకల్, డిసెంబర్ 19: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న మాటను నిజం చేశాడు ఆ యువకుడు.పట్టుదలతో చదివితే విజయం వరిస్తుందని నిరూపిస్తూ.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.మండల పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన వీరబోయిన దయాకర్.ఆయన ప్రస్థానం ఒకే ఉద్యోగంతో ఆగిపోలేదు. తన అకుంఠిత దీక్షతో వరుసగా నోటిఫికేషన్లు వచ్చిన ప్రతిసారీ విజేతగా నిలిచారు.

ఆయన వీఆర్వో,ఆర్‌ఆర్బీ టెక్నీషియన్,పోలీస్ కానిస్టేబుల్ తో పాటు,తాజాగా విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించడంతో దయాకర్ కీర్తి కిరీటంలో మరో రత్నం చేరినట్లయింది.ఒకే గ్రామానికి చెందిన యువకుడు, అదీ సామాన్య నేపథ్యం నుండి వచ్చి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల లింగంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దయాకర్ విజయయాత్ర ప్రస్తుత పోటీ పరీక్షల అభ్యర్థులకు ఒక గొప్ప స్ఫూర్తి అని స్థానికులు కొనియాడారు. ఈ సందర్భంగా దయాకర్ను గ్రామ పెద్దలు, యువకులు ఘనంగా అభినందించారు.