20-12-2025 01:25:59 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణలో మావోయి స్టు ఉద్యమానికి అస్తిత్వ ముప్పు ఏర్పడింది. దశాబ్దాల పాటు దండకారణ్యాన్ని ఏలిన అగ్రనేతలు, దళ సభ్యులు వరుసగా జనజీవన స్రవంతి బాట పడుతున్నారు. శుక్రవా రం రాష్ట్ర చరిత్రలోనే కీలక ఘట్టం చోటుచేసుకుంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమి టీకి చెందిన అత్యంత కీలకమైన 41మంది మావోయిస్టులు ఒకేసారి డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు వీడి లొంగిపోయారు.
24 ఏళ్ల అజ్ఞాతవాసం వీడి.. లొంగి పోయిన వారిలో సామాన్య సభ్యులే కాదు, పార్టీని నడిపిస్తున్న రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారు. ఎగ్రొల్ల రవి అలియాస్ సం తోష్.. కామారెడ్డి జిల్లాకు చెందిన రవి.. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, డివిజనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ అనేక దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన.. చివరకు ఆయుధాలు వీడారు. కనికారపు ప్రభంజన్..
మంచిర్యాల జిల్లాకు చెందిన ఇతను అర్బన్ ఏరియా, పీడీఎస్యూ బాధ్యతలు చూస్తున్నారు. ఇతర కీలక నేతలు.. కోర్సా లచ్చు 21 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న, ఇద్దరు సెంట్ర ల్ విజిన్ కమాండర్లు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యు లు, 12 మంది ఏరియా కమిటీ సభ్యులు , 23 మంది పార్టీ సభ్యులు లొంగిపోయారు. మిగతా వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని డీజీపీ తెలిపారు.
ఆయుధాలు అన్నీ కొల్లగొట్టినవే..
మావోయిస్టులు లొంగుబాటు సందర్భంగా 24 తుపాకులను, భారీ మందు గుం డు సామగ్రిని పోలీసులకు అప్పగించారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైన ఒక ఇన్సాస్ ఎల్‌ఎంజీ, మూడు ఏకే-47 రైఫిల్స్, 5 ఎస్‌ఎల్‌ఆర్, 7 ఇన్సాస్ రైఫిల్స్, ఒక బిజీఎల్ గన్, 4 తుపాకులు, పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలన్నీ మావోయిస్టు లు గతంలో వివిధ ఎన్ కౌంటర్ల సమయంలో ఆర్మీ, పోలీసుల నుంచి కొల్లగొట్టిన వేనని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సీరియ ల్ నంబర్ల ఆధారంగా ఆయా రాష్ట్రాల పోలీసులకు, ఆర్మీ యూనిట్లకు ఈ ఆయుధాలను తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేశారు.
మావోయిస్టులు బయటకు రావడానికి ప్రధాన కారణం పార్టీ అగ్రనాయకత్వం విధించిన డెడ్ లైన్ అని తెలుస్తోంది. పోలీసులు, పారా మిలిటరీ బలగాల దాడులు పెరగడంతో.. సురక్షిత ప్రాంతాల కోసం 2026 మార్చి 31లోగా కొత్త ప్రాంతాలకు (ఛత్తీస్‌గఢ్, ఒడి శా దాటి ఇతర ప్రాంతాలకు) వెళ్లాలని మా వోయిస్టు పార్టీ ఆదేశించింది. తమకు ఏమా త్రం పరిచయం లేని, భాష తెలియని ప్రాం తాలకు వెళ్లేందుకు క్యాడర్ నిరాకరించింది. అక్కడికెళ్తే స్థానిక ప్రజల మద్దతు ఉండదని, నిత్యావసరాలు దొరకవని భయ పడ్డారు.
అడవిలో మిగిలింది 54 మందే..
మావోయిస్టుల బలంపై డీజీపీ శివధర్ రెడ్డి సంచలన గణాంకాలు వెల్లడించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు మొత్తం కలిపి 54 మంది మాత్రమే మిగిలారు. వీరిలో కూడా కేవలం ఆరుగురు 6 మాత్రమే తెలంగాణ రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్నారు. మిగతా వారు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నారు అని తెలిపారు. 2025లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.
లొంగిపోయిన 41 మందిపై ప్రభుత్వం తరఫున మొత్తం రూ. 1.46 కోట్ల రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని వారి పునరావాసం కోసం అందజేస్తామని డీజీపీ తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున చెక్కులను అక్కడికక్కడే పంపిణీ చేశారు. ఆయుధాలతో లొంగిన వారికి అదనపు సాయం అందుతుంది. ఎల్‌ఎంజీ రైఫిల్‌కు రూ.5 లక్షలు, ఏకే-47కు రూ.4 లక్షల చొప్పున ప్రోత్సాహం ఇస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల నక్సల్స్‌ను ఆయా రాష్ట్రాల పోలీసులకు అప్పగిస్తామన్నారు.
నగరంలో ఉగ్ర మూలాలు లేవు
బోండీ బీచ్ కాల్పుల ఘటన వ్యక్తిగత ఉన్మాద చర్య : డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టత
హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఉగ్రమూలాలు లేవని డీజీపీ శివధర్ రెడి చెప్పారు. సిడ్నీలోని బోండీ బీచ్ కాల్పుల ఘటనపై స్పష్టత ఇస్తూ సాజిద్ అక్రమ్ నేపథ్యాన్ని డీజీపీ మీడియాకు వివరించారు. నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్ మూలాలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ, ఈ ఉగ్రఘటనతో హైదరాబాద్ నగరానికి , ఇక్కడి పరిస్థితులకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సాజిద్ అక్రమ్ నేపథ్యాన్ని డీజీపీ మీడియాకు వివరించారు.
ఉపాధి కోసం 1998లోనే సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అక్కడే స్థిరపడి ఓ యూరోపియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు.ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత గత 27 ఏళ్లలో అతడు కేవలం 6 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడని డీజీపీ వెల్లడించారు. పోలీసుల రికార్డుల ప్రకారం సాజిద్ అక్రమ్ హైదరాబాద్ పర్యటనల వివరాలను డీజీపీ బయటపెట్టారు.1998.. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి ఒకసారి నగరానికి వచ్చాడు.
2004, 2009, 2004లో ఒకసారి, 2009 ఫిబ్రవరిలో మరోసారి వ్యక్తిగత పనులపై వచ్చాడు. 2011,2016.. జూన్ 2011లో, ఆ తర్వాత 2016లో కేవలం ఆస్తుల పంపకాలు, సెటిల్మెంట్ కోసం వచ్చాడు. 2022 చివరి సారి.. చివరిసారిగా 2022లో తన తల్లిని, సోదరిని చూడటానికి హైదరాబాద్ వచ్చాడు. సాజిద్ అక్రమ్ చాలా ఏళ్లుగా విదేశాల్లోనే ఉంటున్నాడని, అతడు అక్కడే రాడికలైజ్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి చర్యలకు హైదరాబాద్‌తో లింక్ పెట్టవద్దని, ఇక్కడి నుంచి అతడికి ఎలాంటి సహకారం అందలేదని ప్రాథమిక విచారణలో తేలిందని డీజీపీ స్పష్టం చేశారు.